థియేటర్స్ ఓపెన్ మరో నెల వాయిదా ?
తెలంగాణలో థియేటర్లు తెరవడానికి అడ్డంకులేవీ లేవు. ఇక్కడ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను ఎత్తేశారు. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఐతే ఆంధ్రలో థియేటర్లు తెరవడానికి ఇంకా అనుమతి రాలేదు. జులై 1 నుంచి అక్కడ అనుమతులు లభిస్తాయనే ఆశతో ఉన్నారు. కానీ ఏపీలోనూ డెల్టా వేరియంట్ వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ రీ ఓపెన్ కి అక్కడ ఇప్పట్లో అనుమతి లభించేలా లేదు.
థియేటర్లు మరో ఒక్క నెల తెరవకపోతే, తరువాత తెరచినా విడుదల చేసేందుకు సినిమాలు వుండవు. సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ రిలీజ్ ఖాయం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ అలర్ట్ అయ్యారు. ఆంధ్రలో తెరచినా తెరవకున్నా, తెలంగాణలో మాత్రం జూలై నెలాఖరు నుంచి థియేటర్లు తెరవాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.