పుష్ప రెండు భాగాలు బ్యాక్ టు బ్యాక్
సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. సింగిల్ స్క్రిప్ట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా డబుల్ అయింది. పుష్పని రెండు భాగాలుగా తీసుకురావడం ఫైనల్ అయింది. అయితే రెండు భాగాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయా ? గ్యాప్ ఉండనుందా ? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ‘పుష్ప’ పార్ట్ వన్ ని పూర్తి చేసి.. ‘ఐకాన్’ని సినిమా చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నారట. అయితే సుకుమార్ మాత్రం పుష రెండు భాగాలని బ్యాక్ టు బ్యాక్ తీసుకొస్తేనే బాగుంటుందని అంటున్నాడట.
ఈ విషయంలో బన్నీని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇంతకు ముందు పుష్ప పార్ట్ 1 ని 2022లో రిలీజ్ చేసి.. పుష్ప 2ని 2024లో తీసుకొస్తారనే వార్తలు వినిపించాయి. అయితే బన్నీని ఒకసారి వదిలేస్తే.. మళ్లీ దొరకడం కష్షమని సుక్కు భావిస్తున్నారట. తన వర్కింగ్ సైకాలజీకి రెండు భాగాలు కంటిన్యూగా చేసేస్తేనే బెటర్ అని సుకుమార్ నచ్చ చెబుతున్నట్లు తెలుస్తోంది.