హోస్ట్‌’గా తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హోస్ట్‌ అవతారం ఎత్తనుంది. తెలుగు టీవీ ఛానల్‌లో ప్రసారం కానున్న ‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా తెలుగు’ అనే కార్యక్రమంలో హోస్ట్‌గా సందడి చేసేందుకు సిద్ధమైంది. తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్టు ద్వారా ఈ విషయం తెలిసింది.

షూట్‌కు సిద్ధమవుతున్నప్పుడు తీసిన ఒక ఫొటోను తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ‘మాస్టర్‌ చెఫ్‌ తెలుగు త్వరలో రాబోతోంది’ అంటూ ఆ ఫొటో కింద రాసుకొచ్చింది. ఇదే కార్యక్రమాన్ని విజయ్‌ సేతుపతి హోస్ట్‌గా తమిళంలో ప్రసారం చేయబోతున్నారట. మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హోస్ట్‌ చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తమన్నా చేటిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వెంకటేశ్‌ సరసన ‘ఎఫ్‌3’, నితిన్‌తో కలిసి ‘మ్యాస్ట్రో’, గోపీచంద్‌కు జోడీగా ‘సీటీమార్‌’లో ఆమె నటిస్తోంది. ఆ తర్వాత ‘గుర్తుందా సీతాకాలం’, ‘దటీజ్‌ మహాలక్ష్మీ’తో పాటు ఓ హిందీ చిత్రంలోనూ తమన్నా సందడి చేయనుంది. మరోవైపు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇప్పటికే తమ్మూ నుంచి రెండు వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. ఇటీవలే మూడో వెబ్ సిరీస్ కు ఆమె ఓకే చెప్పిందట. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట.