వారియర్స్‌లా కాదు, మదర్‌ థెరిస్సాలా రండి !

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు తన ప్యానల్‌ను పరిచయం చేస్తూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం మీడియా సమావేశం పెట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన మెగా బ్రదర్ నాగబాబు..  “గడిచిన నాలుగేళ్ల కాలాన్ని చూసుకుంటే ‘మా’ మసకబారిపోయింది” అన్నారు. ఈరోజు మీడియా ముందుకొచ్చిన మా అధ్యక్షుడు నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

ఈ సమావేశంలో శివబాలాజీ మాట్లాడుతూ.. “కమిటీ సభ్యులుగా ఇప్పటివరకూ మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఒకవేళ ఎవరికైనా వాటిపై సందేహాలు ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని అడగవచ్చు. ‘మా’ కార్యాలయంలోని రికార్డ్స్‌లో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి విషయాన్ని నమోదు చేయించాం అన్నారు.  మా ఎన్నికల పోటీ కోసం ఎవరైనా రావొచ్చు.. వారియర్స్‌లా కాదు, మదర్‌ థెరిస్సాలా రండి. సేవ చేయండి. గుర్తింపు పొందండి. పనిచేయండి” అని అన్నారు.