పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్
జులై 1 నుంచి ప్రారంభం కానున్న ‘పట్టణ ప్రగతి’ కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. శనివారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ, అటవీ అధికారులతో ప్రగతి భవన్లో సీఎం సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లను అనుమతించ వద్దని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్… నూతన చట్టాల్లోని నిబంధనలను విధిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కాస్మొపాలిటన్ నగరంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారు.