‘కుడి ఎడమైతే’ పొరపాటు లేదా ?

యూటర్న్‌, లూసీయా వంటి వినూత్న చిత్రాలను తెరకెక్కించిన యువ డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ నుంచి ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ‘కుడి ఎడమైతే’ అనే ఆసక్తికర టైటిల్ ని పెట్టారు. అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌ కీలక పాత్రల్లో పోషించారు. థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో అతి త్వరలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఫస్ట్‌లుక్‌ను తాజాగా ప్రసార సంస్థ ప్రేక్షకులతో పంచుకుంది. ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకునేలా ఆసక్తికరంగా ఉంది. ఈ సిరీస్‌ మొత్తం 8 ఎపిసోడ్లతో అలరించనుంది.