కత్తి మహేష్.. తాజా ఆరోగ్య పరిస్థితి ఏంటీ ?
సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మొదట ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆయన గాయాల తీవ్రత తెలిసి వచ్చింది. తీవ్రంగా గాయపడ్డారు. తల, కంటి భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరే సమయంలో శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడంతో వెంటిలేటర్ ఉంచారు. మరీ.. ఇప్పుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? అంటే క్రిటికల్ గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
”ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో కత్తి మహేశ్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. సీటీ స్కాన్ చేయగా.. తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు గుర్తించాం. ఎమర్జెన్సీలో ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత ఐసీయూకి తరలించాం. తలకు తగిలిన గాయాల వల్ల పరిస్థితి కాస్త విషమంగా ఉంది. ఆరోగ్య పరిస్థితిని ఆయన కుటుంబసభ్యులకు వివరించాం. వారి విజ్ఞప్తి మేరకు మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించాం” అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.