ఇది నాకు గొప్ప గౌరవం : ధావన్

సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తొలిసారి టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండగా.. ధావన్‌ సారథ్యంలో మరో జట్టు శ్రీలంకలో ఆడనుంది. జులై 13న లంకతో పోరు ఆరంభమవుతుంది.

లంక పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆరుగురు కొత్త ఆటగాళ్లతో కూడిన జట్టు ఆదివారం లంకకు బయల్దేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ ద్రవిడ్ తో కలిసి కెప్టెన్ శిఖర్ ధవన్ మాట్లాడారు.

“ఇది చాలా మంచి జట్టు. అందరూ సానుకూల దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆటగాళ్లలో ఎంతో ఉత్సుకత ఉంది. ఇది కొత్త సవాలు. అదే సమయంలో ప్రతిభను ప్రదర్శించడానికి మా అందరికి ఇదో మంచి అవకాశం. అందరూ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నారు” అని ధావన్‌ చెప్పాడు.

💬 💬 It's an honour to lead the Indian team. @SDhawan25 shares his emotions on captaining Sri Lanka-bound #TeamIndia & working with Rahul Dravid. 🇮🇳 👏#SLvIND pic.twitter.com/E5J0b8KjJA
— BCCI (@BCCI) June 27, 2021