యుఎస్ సెక్స్ రాకెట్’లో మెహ్రీన్ పేరు.. !

యుఎస్ సెక్స్ రాకెట్ లో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పేరు బయటపడింది. ఆమెని యుఎస్ అధికారులు విచారించారు కూడా. అలాగని ఈ వ్యవహారంతో మెహ్రీన్ కు సంబంధాలున్నాయని కాదు. యుఎస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బయటపడిన తర్వాత.. అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికాకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్స్ ని అంత ఈజీగా వదలడం లేదు. వారి టూర్ వివరాలని క్షుణంగా అడిగి తెలుసుకొంటున్నారు. వారిని విచారిస్తున్నారు. ఇప్పుడు మెహ్రీన్ విషయంలోనూ అదే చేశారు.

మెహ్రీన్ త‌న కుటుంబాన్ని క‌ల‌వ‌డానికి అమెరికా వెళ్లింది. అక్కడి నుంచి స్నేహితులని కలిసేందుకు కెన‌డా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లింది. అక్కడ అధికారులు మెహ్రీన్ ని ఆపేశారు. ఆమె టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్ అని తెలియడంతో… బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. ఆమెను ప్ర‌త్యేక గ‌దిలోకి తీసుకుని ప్ర‌శ్నించారు. దాదాపు 30 నిమిషాల పాటు విచారించారు. అనంతరం ఆమెకు క్ష‌మాప‌ణ చెప్పి బోర్డింగ్ పాస్ ను అంద‌జేశారు.

ఈ వ్యవహారంతో టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్స్, యంగ్ హీరోయిన్స్ కు సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వారెవరు ? చర్చే ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. శ్రీరెడ్డి లాంటి వారు ఇస్తున్న లీక్స్ తో పరిస్థితి మరింత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మెహ్రీన్ కు జరిగిన అనుభవం దృష్ట్యా.. ఇప్పట్లో అమెరికా వెళ్లే టాలీవుడ్ హీరోయిన్స్ కాస్త జాగ్రత్తగా మెసులుకుంటే మంచిదేమో.. !