దుబాయ్’లోనే టీ20 వరల్డ్ కప్
కరోనా విజృంభణతో భారత్ లో జరగాల్సిన టోర్నీలన్ని ఇతర దేశాలకు తరలిపోతున్నాయ్. ఇప్పటికే అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ మరో మెగా టోర్నీని కూడా యూఏఈకి తరలించేసింది. టీ20 వరల్డ్ కప్ ని దుబాయ్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది.
“రానున్న 2-3 నెలల్లో ఏం జరుగుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని టోర్నీని యూఈఏకి తరలిస్తామని ఐసీసీతో చెప్పాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే ఇండియా తర్వాత టీ20 వరల్డ్‌కప్‌కు యూఏఈయే మంచి వేదిక. ఇండియాలోనే నిర్వహించాలని అనుకున్నాం. ఇండియానే మా మొదటి ప్రాధాన్యతగా భావించాం. కానీ తప్పలేదు. టోర్నీ తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది” బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విట్ చేశారు.