‘అన్నా-చెల్లి’ సెంటిమెంట్ టీ-కాంగ్రెస్ కు కలిసొస్తుందా ?
కాంగ్రెస్ లో ‘అన్నా-చెల్లి’ సెంటిమెంట్ బలమైందిగా భావిస్తుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి – సబితా ఇంద్రారెడ్డిల బంధం గురించి తెలిసిందే. ‘అన్నా-చెల్లి’గా ఆప్యాయంగా ఉండేవారు. సబితని చేవెళ్ల చెల్లిగా పిలిచేవారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకొచ్చినా.. అది చేవెళ్ల నుంచే చేపట్టేందుకు వైఎస్ ఆర్ ఆసక్తి చూపేవారు. తన హయాంలో చెల్లి సబితా ఇంద్రారెడ్డికి మంచి అవకాశాలు ఇచ్చారు. ఏకంగా హోంశాఖని కెటాయించారు. అందుకే వైఎస్ ఆర్ మరణించినప్పుడు సబితా తట్టుకోలేకపోయింది. అప్పట్లో అన్నా-చెల్లి సెంటిమెంట్ కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేష్ లో వరుసగా రెండు సార్లు (2004, 2009) అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లోనూ ఇలాంటి బంధమే ఏర్పడింది. ఎమ్మెల్యే సీతక్క పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని అన్నగా పిలుస్తుంటుంది. ఆయనపై పూర్తి విశ్వాసాన్ని చూపిస్తుంటుంది. ఇటీవల అనూహ్యంగా పాదయాత్ర చేపట్టిన రేవంత్ కోసం ప్రత్యేకంగా షూస్ కొనిచ్చింది. వాటితోనే రేవంత్ పాదయాత్ర చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కడంతో.. మొక్కులు తీర్చుకొనే పనిలో సీతక్క ఉంది. మేడారం వెళ్లిన సీతక్క మొక్కులు చెల్లించారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క అమ్మవారిలకు ప్రదక్షిణలు చేసి… మొక్కు చెల్లించారు. తన సోదరుడు రేవంత్ కు పదవి దక్కటం పట్ల సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ పీసీసీ పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
I have wished a wish in Medaram to goddess Sri Sammakka Saralamma that my brother @revanth_anumula should become Pcc as per people’s wish, today it’s a reality I came to Medaram to thank Goddess🙏
🔥Thanks to Sonia Amma 🙏@RahulGandhi @priyankagandhi @manickamtagore#telangana pic.twitter.com/hVzqVoO52k— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) June 28, 2021