జల వివాదం కొత్త టర్న్.. తెలంగాణకు కరెంట్ కట్ !

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కొత్త టర్న్ తీసుకుంది. జల వివాదం కాస్త విద్యుత్ వివాదంగా మారింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్రమం అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రులు ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి ఏపీ సర్కారుని తిట్టిపోస్తున్నారు. అటు నుంచి పెద్దగా వాయిస్ వినిపించడం లేదు.

ఇక ఇప్పుడీ.. ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. శ్రీశైలంప్రాజెక్టుకు వస్తున్నప్రతి చుక్క నీరును తెలంగాణ ప్రభుత్వం ముందుగానే వినియోగించుకుంటోంది. వాస్తవానికి వరద  నీరు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ విద్యుత్ ఉత్పతి చేయాలి. కానీ ఆ రూల్స్ ఏమీ పాటించకుండా విద్యుత్ ని ఉత్పత్తి చేస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డ్ కి లేఖరాసింది. ఏపీ లేఖకు స్పందిస్తూ తక్షణమే ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి.. నీటిని నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు కృష్ణాబోర్డు ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలని తెలంగాణ సర్కార్ లైట్ తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల్ని కృష్ణాబోర్డు నిలువరించనప్పుడు.. తామెందుకు.. ఆ బోర్డు ఆదేశాలు పాటించాలన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంతేకాదు.. కృష్ణా నీళ్లు దిగువకు రాకుండా ఓ ప్రాజెక్ట్ ని కట్టేందుకు తెలంగాణ సర్కారు సర్వే కూడా చేస్తున్నట్టు సమాచారమ్. మొత్తానికి.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. అది కొత్త టర్న్స్ తీసుకొని విస్తరిస్తోంది కూడా. మరీ.. చివరికిఎవరు తగ్గుతారు ? ఈ వివాదం ఎలా ముగుస్తుంది?? అన్నది చూడాలి.