‘ఆర్ఆర్ఆర్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒకే బైక్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చక్కర్లు కొడుతున్న స్టిల్ ను విడుదల చేశారు. గుర్రంపై చరణ్, బైక్ పై ఎన్టీఆర్ పోటీపడుతున్న స్టిల్ ను గతంలో విడుదల చేసిన యూనిట్, ఈసారి ఇలా ఇద్దర్నీ ఒకే బైక్ పై కూర్చోబెట్టింది. ఈ పోస్టర్ తో పాటు సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు తెలిపారు.

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. 2 భాషలకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ పూర్తిగా డబ్బింగ్ చెప్పేశారని, మిగతా భాషల డబ్బింగ్ కూడా అతి త్వరలో పూర్తవుతుందని తెలిపింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. సీత పాత్రలో అలియాభట్ నటించింది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు మొత్తంగా 13 భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.