సెకండ్‌ వేవ్‌ ముప్పు ఇంకా ముగిసిపోలేదు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టింది. దీంతో పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ముప్పు ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది.

‘కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ విశ్రమించకూడదు. కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.