సెకండ్‌వేవ్‌లో ఇదే దారుణం
దాదాపు యేడాదిన్నరగా దేశ ప్రజలు కరోనాతో పోరాడుతున్నారు. రెండో వేవ్ తగ్గుముఖం పట్టినా.. మూడో వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. అయితే ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాల రేటు 40శాతం అధికంగా ఉన్నట్లు మ్యాక్స్ హెల్త్‌కేర్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా యువత కరోనా బారిన పడి మరణించటం ఆందోళన కలిగించే విషయమని వివరించింది.
తొలిదశలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించటం, కఠిన ఆంక్షలతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఆ తర్వాత ఆంక్షలు సడలించడంతో మరోసారి కరోనా విజృంభించింది. దీంతో మళ్లీ రాష్ట్రాల వారీగా లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి.