నిహారిక పెళ్లికి గోపీచంద్ అడ్డు

మెగా హీరోయిన్ నిహారిక.. నిర్మాత యం. ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ – నిహారిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. యు.వి.క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. జులై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే ఈ నెల 21 ఇన్విటేషన్ విడుదల చేయనున్నారు.
నిహారిక పెళ్లికి యాక్షన్ హీరో గోపీచంద్ అడ్డుగా వస్తున్నాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్ 25వ సినిమాగా ‘పంతం’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని జులై 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిహారిక వెడ్డింగ్ జులై 5న ఉండటంతో గోపీచంద్ ‘పంతం’ వీడుతాడు. ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందనే ప్రచారం జరిగింది. ఐతే, నిర్మాత కె.కె రాథామోహన్ ‘పంతం’ని జులై 6న ప్రేక్షకుల ముందుకు రావడం పక్కాని మరోసారి స్పష్టం చేశారు. దీంతో నిహారిక పెళ్లికి గోపీచంద్ అడ్డు వస్తున్నాడని సరాదా చెప్పుకొంటున్నారు.