కోమటిరెడ్డికి సీతక్క కౌంటర్
తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బలం, బలగం కూడా పెరుగుతోంది. ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడంపై భువనగిరి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కరే బహిరంగంగా వ్యతిరేకించారు. ఓటుకు నోటు మాదిరిగా పీసీసీ పదవిని అమ్ముకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వాదనకు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. క్యాడర్ కూడా రేవంత్ తోనే ఉంది. వెంకట్ రెడ్డి సొంత తమ్ముడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ కే సపోర్ట్ చేశారు. ఇక సీనియర్లని రేవంత్ స్వయంగా కలిసి చల్లబరిచారు.
ఇక కోమట్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు. అధికారాన్ని అనుభవించడానికి తాము కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీలో చేరామని సీతక్క అన్నారు. రేవంత్ అన్నకు పెద్ద పదవి వచ్చిందనే సంతోషం ఉందని… ఇదే సమయంలో తమపై బాధ్యత పెరిగిందన్నారు. అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే రేవంత్ రెడ్డికి పీసీపీ పదవిని ఇవ్వడం జరిగిందని అన్నారు. సీతక్క నేరుగా కోమట్ రెడ్డి పేరుని ప్రస్తావించకున్నా.. ఆయన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు.