9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
విద్యార్థులకు ఏపీ కేబినేట్ గుడ్ న్యూస్ చెప్పింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లని అందించాలని నిర్ణయించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించడం సాధ్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయనగరంలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజ్‌ను యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించింది. ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.