ఆ లక్షణాలు రౌడీ హీరోలో లేవా?
హీరోయిన్ రష్మిక మందన తనని పెళ్లి చేసుకొనేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో మరోసారి చెప్పింది. “మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి’ అని చెప్పింది. దీంతో.. ఆ లక్షణాలు రౌడీ హీరో విజయ్ దేవరకొండలో లేవా ? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే ? వీరిద్దరు కలిసి ఇప్పటికే రెండు (గీత గోవిందం, వరల్డ్ ఫేమస్ లవ్వర్) సినిమాల్లో నటించారు. దీంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. అప్పుడప్పుడు కలుసుకుంటారు. గతంలో ఓసారి రస్మిక విజయ్ ఇంట్లో కనబడింది. ఓ సారి ముంబైలో ఓ పార్టీలోనూ వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. తన మొగుడు ఇలా ఉండాలని రస్మిక చెప్పిన లక్షణాలు విజయ్ లో ఉన్నాయని అంటున్నారు.
ఇక తెలుగులో చాలా వేగంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రస్మిక. కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్ బై’తో బిజీగా ఉంది. మరిన్ని బాలీవుడ్ సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నాయట. చూస్తుంటే.. ఈ నేషనల్ క్రస్ బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగేలా ఉంది.