అఖండ క్లైమాక్స్’ని అక్కడ ప్లాన్ చేశాం

తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘అఖండ’ షూటింగ్ విశేషాలని దర్శకుడు బోయపాటి శ్రీను పంచుకున్నారు. బుధవారం ఉదయం బోయపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన్ని మీడియా పలకరించింది. అఖండ షూటింగ్ విశేషాలు అడిగింది. త్వరలోనే క్లైమాక్స్ షూట్ ఉంటుందని బోయపాటి తెలిపారు.

” ‘అఖండ’ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ లొకేషన్‌ కోసం వెతుకుతున్నాం. హైదరాబాద్‌లో వర్షాలు ఉండటంతో కడపలో లొకేషన్‌ చూస్తున్నాం. కరోనా మూడో దశ వ్యాప్తిని బట్టి అఖండ సినిమాను విడుదల ఉంటుంది.” అని తెలిపారు.

బాలయ్య – బోయపాటిలది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన రెండు చిత్రాలు సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో వీరి హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాని గ్రాండ్ గా తీసుకొస్తున్నారు బోయపాటి. బాలయ్యకు అఖండ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాడు.