మహేష్-రాజమౌళి సినిమా.. జోనర్ ఇదే !

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వీరి కాంబోలో సినిమా మొదలు కానుంది. కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా వ్యవహారాలు మొదలైనట్టు సమాచారమ్. రాజమౌళి-మహేష్- కేఎల్ నారాయణ మధ్య చర్చలు జరిగాయట.

మరోవైపు జక్కన్న మహేష్ ని ఎలా చూపించబోతున్నాడు ? ఏ జోనర్ లో సినిమా ప్లాన్ చేశాడు ?? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మహేష్ ని జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూపించనున్నాడనే ప్రచారం గతంలో జరిగింది. అయితే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? సామాజిక అంశాల పై కమర్షియల్ ఫిల్మ్ రూపొందించే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తుంది. మరీ.. ఇందులో నిజమెంత ? తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.