కాజల్ డైట్ సీక్రెట్.. ఇదే !
చందమామ కాజల్ వయసు పెరిగినా.. వన్నె తగ్గడం లేదు. పైగా మరింత అందంగా తయారవుతోంది. 15 ఏళ్లుగా అదే ఫిజిక్, అదే గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. అదేలా సాధ్యం ? అన్న ప్రశ్నలకు కాజల్ సమాధానం చెప్పింది. తన డైట్ సీక్రెట్ ఇదేనంటూ.. ప్రతిఓజూ ఏం తింటాను అనే విషయాలు తెలిపింది.
ప్రతిరోజూ ఉదయాన్నే ఓ గుడ్డు తింటుంది కాజల్. ఆ తర్వాత గంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక కర్రీతో చేసిన జొన్న రొట్టెలు తింటుంది. ఆ తర్వాత లంచ్ కు 2 గంటల ముందు ఏదైనా ఒక ఫ్రూట్ ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనంలో భాగంగా పప్పు, అన్నం, కూరగాయలు తింటుంది. సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. ఇక డిన్నర్ లో మధ్యాహ్నం తిన్న భోజనమే రిపీట్ చేస్తుంది. రోజంతా మధ్యమధ్యలో ప్రొటీన్ షేక్ లేదా కొబ్బరి నీళ్లు తాగుతుందట.