తేజ సజ్జా-శివాని.. అద్భుతం !

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. కొత్త జోనర్ లో తెలుగు ప్రేక్షకులని బాగానే భయపెట్టారు. ఇప్పుడీ.. వీరి కాంబో మరో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసింది. ఈ చిత్రానికి హనుమాన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ని స్టార్ చేశాడు తేజు సజ్జా.

ఈ సినిమా టైటిల్ ను లుక్ ను హీరో నాని విడుదల చేసారు. శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు “అద్భుతం” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ అందించ‌డం విశేషం. చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. తేజు సజ్జా-శివానిల ఫస్ట్  లుక్ పోస్టర్ ని కూడా వదిలారు. ఆ పోస్టర్ టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది.