ప్రకాశ్‌రాజ్‌కు సుమన్ మద్దతు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకీ ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు. అయితే బలమైన అభ్యర్థిగా భావిస్తున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ లోకల్ అనే వాదన తెరపైకి వచ్చింది. కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
తాజాగా మాలో లోకల్, నాన్ లోకల్ వ్యవహారంపై సీనియర్ హీరో సుమన్ స్పందించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరోక్షంగా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి స్పందించారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్ కిందే లెక్క అన్నారు. వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని అన్నారు. సుమన్ వ్యాఖ్యలని బట్టీ చూస్తే.. ఆయన ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్టు క్లారిటీ వచ్చింది.