వీహెచ్‌కు సోనియా ఫోన్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కిడ్నీ సమస్యతో హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీహెచ్ ని పరామర్శించారు. రేవంత్ కు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలిసి సోనియా గాంధీ దగ్గరకు వెళ్దామని అన్నారు. వీహెచ్ అనారోగ్యం గురించి సోనియా, రాహుల్‌ కు తెలిసింది.

ఇవాళ సోనియాగాంధీ వీహెచ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని వీహెచ్‌కు సోనియా సూచించారు. సోనియా అంటే వీహెచ్ ని వీరాభిమానం. సోనియమ్మ అంటూ ఆమె జపం చేస్తుంటారు. స్వయంగా సోనియా ఫోన్ చేసి పరామర్శించడంతో.. వీహెచ్ చాలా ఆనందపడ్డారని చెబుతున్నారు.