విశాఖలో తొలి కరోనా డెల్టా వేరియంట్ కేసు
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇక సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడినట్టేనని సంతోషించే లోపు థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. దేశంలో డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖలో తొలి డెల్టా వేరియంట్ కేసు నమోదైంది. విశాఖ వాంబే కాలనీకి చెందిన 51 ఏళ్ల మహిళలో డెల్టా రకం వైరస్ గుర్తించినట్టు అధికారులు దృవికరించారు.
గతేడాది కరోనా బారిన పడిన సదరు మహిళ హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. ఇటీవల కరోనా అనుమానంతో మధురవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా.. వైద్యులు పాజిటివ్‌గా తేల్చారు. ఆమె నమూనాలను హైదరాబాద్ పంపారు. ఆమెకు డెల్టా రకం వైరస్ సోకిందని నివేదిక వచ్చిందని గుర్తించారు.