అర్జున్ రెడ్డి.. రెండు మంచి పనులు !
టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవకొండ చేసిన రెండు మంచి పనులు ఆకట్టుకొంటున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో క్రేజ్ హీరోగా మారాడు విజయ్. ఇటీవలే ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుని అందుకొన్నాడు. ఇప్పుడీ అవార్డుని వేలం వేసేందుకు విజయ్ రెడీ అయ్యాడు. దాంతో డబ్బులని సీఎం ఫండ్ కు ఇస్తానని ప్రకటించారు.
ఎవరైనా సాయం కోరితే మంత్రి కేటీఆర్.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుండడాన్ని తాను రోజూ ట్విట్టర్ లో చూస్తున్నా. తన తొలి అవార్డును వేలంలో అమ్మదలచుకున్నా. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని ట్విట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ యంగ్ హీరో నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం చేశారు. తొలి ఫిల్మ్‌ఫేర్ సాధించినందుకు అభినందనలు తెలుపుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆయన సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉందని, ఆయన చొరవను అభినందిస్తున్నానని కేటీఆర్ ట్విట్ చేశారు.
ఈ యంగ్ హీరో చేసిన మరో మంచిపని కూడా హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ సాయి పుట్టినరోజు కానుకగా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. గోల్డ్ చైన్ ని బహుకరించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో.. ఒకేరోజు విజయ్ దేవకొండ చేసిన రెండు మంచి పనులు హాట్ టాపిక్ గా మారాయి.