మ్యాచ్ కు ముందు శృంగారం.. ధోనిసేన వరల్డ్ కప్ గెలుపు సీక్రెట్ ఇదేనా ?
ధోనిసేన వన్డే వరల్డ్ కప్ గెలవడం వెనక సీక్రెట్ ఏంటో తెలుసా ? మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనడమే అంటున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లకు అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ ఓ వింత సూచన చేశాడట. మ్యాచులకు ముందు శృంగారంలో పాల్గొనాలని చెప్పాడట.
ఈ విషయాలను ప్యాడీ అప్టన్ తన ఆత్మకథ ‘ది బేర్‌ఫూట్ కోచ్’ పుస్తకంలో తెలిపారు. ఆ సూచన చేసిన సమయంలో అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు నోట మాట రాలేదట. వింతగా చూశాడట. అయితే ఆ సూచనపై తర్వాత క్షమాపణలు చెప్పినట్టు అఫ్టన్ రాసుకొచ్చారు. ‘శృంగారం చేయడం వల్ల మీ ప్రదర్శన మెరుగవుతుందా? అవును, పెరుగుతుంది’ అని తన ఆత్మకథలో రాసుకున్నారాయన. ఇప్పుడు అఫ్టన్ ఇచ్చిన సలహా తెలిసి.. బహుశా అదే ధోనిసేన వరల్డ్ కప్ గెలుపు సీక్రెట్ కావొచ్చని నెటిజన్స్ సటైర్స్ వేస్తున్నారు.