కేసీఆర్ అనుమతితోనే రాయలసీమ ప్రాజెక్టు
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. రాయలసీమ ప్రాజెక్ట్ అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఏపీ మంత్రులు ఆ రేంజ్ లో రియాక్ట్ కావడం లేదు. ఈ విషయంలో ఇన్నాళ్లు కామ్ గా ఉన్న ఏపీ సీఎం జగన్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ లేఖ రాశారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారని తెలిపారు. సజ్జల మాటలని బట్టీ.. రాయలసీమ ప్రాజెక్ట్ కు సీఎం జగన్ ముందస్తు అనుమతిని ఇచ్చారు అన్నమాట. ఆ తర్వాత ఆయన యూటర్న్ తీసుకొని.. గొడవకు దిగారని తెలుస్తోంది.