గుడ్ న్యూస్ : ప్ర‌భుత్వ ఓటీటీలు వచ్చేస్తున్నాయ్

కరోనాకి ముందు.. కరోనా తర్వాత అన్నట్టుగా చిత్రసీమలో మార్పులొచ్చాయ్. ఓటీటీల హవా పెరిగింది. పేరు పొందిన నిర్మాణ సంస్థలు, బడా దర్శక-నిర్మాతలు ఓటీటీల వైపు చూస్తున్నారు. దీంతో.. కొత్త కొత్త ఓటీటీ వేదికలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌భుత్వమే.. ఓ ఓటీటీ సంస్థ‌ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. చిన్న సినిమాల‌కు ఈ వేదిక ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని కేర‌ళ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి ప్ర‌క‌టించారు.

మ‌ల్లూవుడ్ నుంచి యేడాదికి దాదాపు 100 సినిమాలువ‌స్తున్నాయి. వాటిలో చిన్న సినిమాల‌దే అగ్ర పీఠం. అయితే వాటిలో చాలా వ‌ర‌కూ విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. ఈ సమ‌స్య‌ని ప‌రిష్క‌రించడానికే ఓటీటీ సంస్థ‌ని నిర్మిస్తున్న‌ట్టు కేర‌ళ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కేరళని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటీటీలని తీసుకొచ్చే అవకాశాలున్నాయ్. ప్రభుత్వ ఓటీటీలతో ప్రేక్షకులని కావాల్సినంత వినోదం దక్కనుంది అన్నమాట.