‘విరాటపర్వం’ కోసం ఇద్దరు దర్శకులు
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి కీలక పాత్రలో నటించారు.నిజానికి ఏప్రిల్ లోనే ఈ సినిమా రావాల్సింది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ.. కరోనా కారణాలతో విడుదల కాలేదు.
ఇప్పుడీ.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా కోసం మరో దర్శకుడు కూడా పని చేశారట. వేణు ఉడుగుల కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించలేకపోయారని, ఆయన స్థానంలో మరో దర్శకుడు ఆ బాధ్యత తీసుకున్నాడని సమాచారం.