దేశంలో 44,111 కొత్త కేసులు, 738 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో 44,111 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 738 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,05,02,362కి చేరాయి. మరణాల సంఖ్య 4,01,050కి చేరాయి.

నిన్న ఒక్కరోజే 57,477 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 5 లక్షల దిగువకు చేరాయి. మొత్తం రికవరీలు 2.96 కోట్ల మార్కును దాటాయి. క్రియాశీల రేటు 1.67 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగింది.