కత్తి మహేష్ కు ఏపీ సర్కార్ సాయంపై.. వివాదం !

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖ‌ర్చుల నిమిత్తం ఏపీ ప్ర‌భుత్వం రూ.17 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేసింది. ఇప్పుడీ.. ఈ సాయంపై సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోంది.

హిందూ వ్య‌తిరేకి కాబ‌ట్టే కత్తి మహేష్ కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించింద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రు త‌మ పార్టీ సానుభూతిప‌రుడు కాబ‌ట్టే భారీ మొత్తంలో యుద్ధ ప్రాతిప‌దిక‌న నిధులు మంజూరు చేసింద‌నే వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. ఈ నెగెటివ్ కామెంట్స్‌కు వైసీపీ సోష‌ల్ మీడియా, కత్తి మహేష్ అభిమానులు కౌంట‌ర్ ఇస్తున్నారు.

ఇక్కడ మరో టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది. అస‌లు సీఎం రిలీఫ్ ఫండే లేద‌ని చెప్పిన ప్ర‌భుత్వం, క‌త్తి మ‌హేష్‌కు మాత్రం ప్ర‌త్యేకంగా ఎలా విడుద‌ల చేసింద‌నే ప్ర‌శ్న‌ల‌ను తెర‌పైకి వస్తున్నాయి. మొత్తానికి.. నెటిజన్స్ మధ్య కత్తి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాలు రక్తాలేమీ కారవు.. కానీ అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.