‘మా’ భవనం స్కాం.. ముక్కున వేలేసుకోవాల్సిందే!
‘మా’ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మాకు భవనం అన్నది ప్రధాన అజెండా. ఈసారి కూడా అదే ఎజెండాతో మా ఎన్నికలు జరగనున్నాయ్. అసలు ఇన్నాళ్లు మా భవనం కోసం ఎందుకు స్థలం కొనలేకపోయారు ? అంటే.. కొన్నారు. కానీ అమ్మారు. ఆ స్కామ్ సినీ ట్విస్ట్ ని తలపిస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ప్రెసిడెంట్ గా వుండగా మా సంఘం కోసం ఓ ఫ్లాట్ కొన్నారట. జూబ్లీ హిల్స్ లోనే మురికిగుంట పక్కనట.ఆరోజుల్లో 45 లక్షలకు కొన్నారట. ఇంటీరియర్ సొగసులు అద్దకంతో ఆ రేటు రూ.50లక్షలకు చేరింది.
ఆ స్థలం కొన్నడం చాలా మందికి తెలుసు. కానీ అమ్మిన విషయం మాత్రం ఎవరికీ పెద్దగా తెలీదు. ఆఖరికి శివాజీ రాజా టైమ్ లో అమ్మేయడానికి ప్రయత్నిస్తే సరిగ్గా బేరాలు రాలేదు. ఆఖరికి కొందరి ‘పెద్దల’ వత్తిడితోనో, సలహా సూచనలతోనో, 34 లక్షలకు అమ్మేసారు. ఆ భవనం కొన్నది కూడా మా సంఘానికి ఏటా డైరీని 8 లక్షలకు ప్రింట్ చేసే వ్యక్తికే అని సమాచారమ్. ఇప్పుడు.. మా ఎన్నికల వేళ.. ఈ స్కామ్ బయటికొచ్చింది. ఈ ఎన్నికల్లో ఇదో అస్త్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.