అక్టోబర్ వరకు నో ఓటీటీ.. తెలంగాణ ఎగ్జిబిటర్ల ఆల్టీమేటం !

కరోనా విజృంభణతో తెలుగు రాష్ట్రాల్లో రెండోసారి థియేటర్స్ మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయ్ అన్న విషయం క్లారిటీ లేదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ కి అనుమతులు ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటిటి దారి పడుతున్నాయి. దాంతో ఎగ్జిబిటర్లలో కలవరం బయలుదేరింది. శనివారం తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా సమావేశం అయ్యారు. అక్టోబర్ వరకు ఓటీటీకి సినిమాలు ఇవ్వొద్దని తీర్మానించారు. 

ఓటిటి వ్యవహారాలు ఇప్పుడు బాగానే వున్నా, భవిష్యత్ లో ఎలా వుంటుందో తెలియదని, థియేటర్ వ్యవస్థ పతనం అయిపోతే ఓటిటి అనేది మోనోపలీకి దారితీసే ప్రమాదం వుందని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నెలాఖరు వరకు నిర్మాతలు తమ తమ సినిమాలను హోల్డ్ చేసి పెట్టాలని, ఒటిటికి ఇవ్వవద్దని కోరుతూ సమావేశంలో ఓ తీర్మానం చేసారు. అలా కాదని ఓటీటీకి వెఌతే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది.

నారప్ప, విరాటపర్వం సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత సురేష్ బాబు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్ల సమావేశం.. నిర్మాణం.. హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నారప్పకు వార్నింగ్ అన్నమాట.