ధనుష్ తెలుగు సినిమా.. కథ ఇదే !

కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. క్లాస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తొలి తెలుగు సినిమా రాబోతుంది. ఇప్పటికే కథ ఓకే అయింది. శనివారం శేఖర్ కమ్ముల ధనుష్ ని కలిశాడు కూడా. దీంతో సినిమా పనులు వేగవంతం అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పోలీస్ పాత్ర ఉంది. ఇందులో మరో స్టార్ హీరో కనిపిస్తారని చెబుతున్నారు. తెలుగు లేదా తమిళ్ హీరోని తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.

శేఖర్ కమ్ముల సినిమా కాక.. మరో రెండు తెలుగు సినిమాలని ధనుశ్ ఓకే చేశారని సమాచారమ్. ఇందులో వెంకీ అట్లూరి సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. ఇటీవ‌ల ధ‌నుష్ తో వెంకీ అట్లూరి ములాఖాత్ జ‌రిగింది. క‌థ కూడా ఓకే అయిపోయింది. విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో క‌థ సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని ఎత్తి చూపే విధంగా ఈ క‌థ ఉంటుంద‌ని, ధ‌నుష్ పాత్ర సీరియ‌స్ ఎమోష‌న్‌తో సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ధనుష్ ఓకే చేసిన మూడో తెలుగు సినిమా వివరాలు ఇంకా బయటకు రాలేదు.