‘వైఎస్ఆర్’ ఎవరివాడు ?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ‘వైఎస్ఆర్’ కీలకంగా మారాడు. ఆయన ఎవరివాడు ? అనే వాదన తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేష్ లో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ఆర్ ది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారాయన. అయితే తెలుగు రాష్ట్రాల ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ ఆర్ ఎవరి ఆస్తి అన్న చర్చ మొదలైంది. జల వివాదంలో తెలంగాణ మంత్రులు వైఎస్ ఆర్ ని విమర్శిస్తున్నా.. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లైట్ తీసుకుంది.
ఇక తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల.. వైఎస్ ఆర్ పై వస్తున్న విమర్శలకు స్పందించడం లేదు. రాయలసీమ బిడ్డ అయిన షర్మిల తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామంటే ఎవరు నమ్మడం లేదు. షర్మిల పార్టీ వెనక తెరాస ఉంది. తెలంగాణలో వైఎస్ ఆర్ అభిమానుల ఓట్లని చీల్చడానికే ఆమెని తెరపైకి తీసుకొచ్చారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ ఆర్ తమ వాడే. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గొంతు పెంచాడు. రేవంత్ రాజకీయం కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ ఆర్ ఎవరివాడు ? అనే చర్చ సాగుతోంది.