కోర్టు కేసులో మహేష్ సినిమా
సూపర్ స్టార్ మహేష్ తన 25వ సినిమాని మొదలెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి డెహ్రాడూన్ లో తొలి షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. మొదటి రోజే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సెట్స్ కి వచ్చి మహేష్ ని కలిశారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ 25వ సెట్స్ మీదకు అయితే వెళ్లింది. కానీ, ఈ సినిమాకు సంబంధించిన కోర్టు కేసులు ఇంకా క్లియర్ కాలేదని చెబుతున్నారు. నిర్మాత పీవీపీ మహేష్ సినిమాపై మరో కేసు వేసినట్టు తాజా సమాచారమ్.
వాస్తవానికి మహేష్ 25వ సినిమా పీవీపీ బ్యానర్ లో తెరకెక్కాల్సి ఉంది. వంశీపైడి పల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా మా బ్యానర్ లో తెరకెక్కనుందని పీవీపీ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. ఐతే, ఆ తర్వాత వంశీ పైడిపల్లి, పీవీపీల మధ్య గొడవలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మహేష్ సినిమాకు నిర్మాతలు మారారు. అశ్వినీదత్, దిల్ రాజులు మహేష్ 25వ సినిమాని టేకప్ చేశారు. కోర్టులో కేసులు నడుస్తున్న ధైర్ఘ్యం చేసి మహేష్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇప్పుడు పీవీపీ మరోసారి మహేష్ సినిమాపై కోర్టులో కేసు వేశారు.
‘బ్రహ్మోత్సవం’ అట్టర్ ప్లాప్ తర్వాత పీవీపీ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చాడు. ఇక, ‘ఊపిరి’ సినిమా దర్శకుడు వంశీపైడిపల్లి పీవీపీ బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమాని సెట్ చేసింది పీవీపీ బ్యానర్. ఐతే, ఆ తర్వాత విబేధాలు తలెత్తి మహేష్ 25వ సినిమా చేతులు మారింది. ఇప్పుడు పీవీపీ మరోసారి కోర్టుకెక్కడంతో మహేష్ 25వ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశాలున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు.