మోడీ దగ్గరే ఉన్న కీలక శాఖలు.. ఏంటో తెలుసా ?

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ కొలువుదీరింది. మోదీ జట్టులో కొత్తగా 43 మంది ప్రమాణస్వీకారం చేశారు. మోడీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత చేసిన తొలి మంత్రివర్గ విస్తరణ ఇది. యువతకు పెద్దపీఠ వేస్తూనే.. సీనియర్లకు ప్రాధాన్యతని ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా కొన్ని శాఖలు ప్రధాని వద్దనే ఉన్నాయి. వీటిలో కొన్ని కీలక శాఖలు కుడా ఉన్నాయి.

శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుఇంధనం, అంతరిక్ష విభాగం, ముఖ్యమైన విధాన నిర్ణయాలు, ఇతర మంత్రులకు కేటాయించని మంత్రిత్వ శాఖలను స్వయంగా ప్రధాని మోడీ పర్యవేక్షించనున్నారు.