కేసీఆర్’ని కొట్టాలంటే.. ఏం చేయాలో చెప్పిన కేటీఆర్ !

తెలంగాణలో టీఆర్ఎస్ ని గద్దె దించాలి. సీఎం కేసీఆర్ ని కొట్టాలనే పట్టుదలతో ప్రతిపక్షాలు ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ బీజేపీలో ఊపొచ్చింది. ఈ ఊపుతోనే 2023లో కేసీఆర్ ని కొట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో.. ఆ పార్టీకి కొత్త కళ వచ్చింది. పీసీసీ పోస్ట్ దక్కిన మూడ్నాలుగు రోజులకే రేవంత్ దూకుడు చూపిస్తున్నాడు. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతం. సీఎం కేసీఆర్ ని ఇంటికి పంపుతం అంటున్నాడు. కేసీఆర్ ని గద్దె దించే బాధ్యతని తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారని.. ఇక నుంచి రెండేళ్ల పాటు రాష్ట్రం కోసం వారి పని చేస్తారని ఉత్తేజ పరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

సీఎం కేసీఆర్ ని కొట్టాలంటే.. ఆయనకు కంటే మించి తెలంగాణపై ప్రేమ ఉండాలి. అప్పుడే కేసీఆర్ ని కొట్టగలరు. దాదాపు 20యేళ్లకు పైగా తెలంగాణ కోసం కేసీఆర్ పనిచేస్తుండు. వైఎస్ ఆర్ , చంద్రబాబు లాంటోళ్లతో కేసీఆర్ కొట్లాడిండు. దేశంలోని అన్ని పార్టీలని తెలంగాణ కోసం ఒప్పించిండు. కేంద్రంలోని పార్టీల మెడలు వచ్చి తెలంగాణ తెచ్చిండు. అన్నీ రాష్ట్రాలకు సీఎం లు ఉంటారు. కానీ తెలంగాణకు రాష్ట్రానికి తెచ్చిన సీఎం ఉన్నడు. ఆయన్ని కొట్టాలంటే అంత ఈజీ కాదన్నాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఏదో ప్రధాని పదవి వచ్చినట్టు పోజులు కొడుతుండు అని ఎద్దేవా చేశాడు.

మొత్తానికి.. కేటీఆర్ మాటాలు బుల్లెట్ లా పేలాయ్. అవి నేరుగా వచ్చి ప్రత్యర్థుల గుండెల్లో గుచ్చుకొనేలా ఉన్నాయి. ఒకేసారి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ల గూబగుయ్ మనేలా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెరాస శ్రేణులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>కేసీఆర్ ని గెలవాలంటే.. కేసీఆర్ గారి కంటే ఎక్కువగా తెలంగాణ ను ప్రేమించాలి : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ <a href=”https://twitter.com/KTRTRS?ref_src=twsrc%5Etfw”>@KTRTRS</a>. <a href=”https://t.co/GnRgzDu9Ex”>pic.twitter.com/GnRgzDu9Ex</a></p>&mdash; TRS Party (@trspartyonline) <a href=”https://twitter.com/trspartyonline/status/1413084259233849348?ref_src=twsrc%5Etfw”>July 8, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>