‘జెర్సీ నం.7’కు వీడ్కోలు
జెర్సీ నం.7 – ఇది మహేంద్ర సింగ్ ధోని జెర్సీ. నెం.1 జెర్సీతోనే మహీ మైదానంలోకి దిగేది. అద్భుతాలు సృష్టించింది. కెప్టెన్ గా టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లని అందించిన ఘనత మహీది. వన్ డే, టెస్టుల్లోనూ టీమిండియాని నెం.1 స్థానంలో నిలిచాడు. అలాంటి దిగ్గజ ఆటగాడి జెర్సీ నెం.7కు వీడ్కోలు పలకాలు. దిగ్గజాల జెర్సీలని భద్ర పరచాలని మాజీ క్రికెటర్ సాబా కరీమ్ అభిప్రాయపడ్డారు.
“ధోనీ జెర్సీ మాత్రమే కాదు మరికొందరు భారత దిగ్గజాల జెర్సీలనూ బీసీసీఐ భద్రపరచాలి. వారు ధరించిన జెర్సీ నంబర్లను ఇతరులు వాడకుండా చూడాలి. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లిన దిగ్గజాలకు ఇదో గుర్తింపు. వారిని ఇలా గౌరవించొచ్చు” అని సాబా కరీమ్ అన్నారు.