తెదేపాకు ఎల్ రమణ రాజీనామా.. తెరాసలో చేరుతానని ప్రకటన !
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు.
గత నెలరోజుల ఎల్ రమణ తెరాసలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రమణ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రమణ తెరాసలో చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
ఇక ఈరోజు టీ-తెదేపాకు రాజీనామా చేసి.. తెరాసలో చేరుతానని అధికారికంగా ప్రకటించారు. మూడ్నాలుగు రోజుల్లోనే రమణ తెరాస తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారమ్. ఎమ్మెల్యే టికెట్ తో పాటు పార్టీలో పదవిపై రమణకు సీఎం కేసీఆర్ గట్టి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.