కాంగ్రెస్ లో తెజస విలీనం.. క్లారిటీ ఇచ్చిన కోదండరాం !
పీసీసీ బాధ్యతలు రేవంత్ రెడ్డి చేపట్టడంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఊపొచ్చింది. ఈ ఊపులోనే తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రగతి భవన్ గోడలని కూలగొడటం.. సీఎం కేసీఆర్ ని గద్దె దింపుతామని రేవంత్ గర్జిస్తున్నారు. ఈ పోరాటంలో రేవంత్ రెడ్డి తెజస అధ్యక్షుడు కోదండరాం రెడ్డి సహాయం తీసుకోనున్నారు అనే మాటలు వినిపించాయి. ఈ క్రమంలో తెజస కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ ప్రచారంపై కోదండరాం స్పందించారు. అది తప్పుడు ప్రచారం. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఝప్తి చేశారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పొడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని.. పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీతోనైన కలిసి పోరాటం చేస్తామని పేర్కొన్నారు.