వావ్.. ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ !

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఖైదీ, మాస్టర్ సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్ చేస్తున్న చిత్రమిది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. కనిపించే మూడు సింహాల మాదిరిగా కమల్, విజయ్ సేతుపతి, ఫాజిల్ లుక్ లని డిజైన్ చేశారు. ఇప్పుడీ.. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులోప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్టు సమాచారమ్. ‘ఖైదీ’తో అందరి చూపులని తనవైపు తిప్పుకున్నాడు లోకేష్ కనగరాజ్. అయితే ఆయన రెండో సినిమా మాస్టర్ మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. మరీ.. మూడో సినిమా విక్రమ్ లో మళ్లీ ఆయన మార్క్ కనిపిస్తుందేమో చూడాలి.