ఇంకా ఎన్నాళ్లు.. ఈ ఎదురు చూపులు ?

టాలీవుడ్ లో లక్కు లేని హీరోయిన్స్ జాబితా పెద్దదే. లావణ్య, రెజీనా, ఈషా రెబ్బా.. ఇలా చాలా మందే ఉన్నారు. అయితే వీరిలో ఈషా రెబ్బా మాత్రం పోరాటం ఆపడం లేదు. తనలోని అన్నీ యాంగిల్స్ ని చూపించే ప్రయత్నం కంటిన్యూస్ గా చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అవి వైరల్ అవుతున్నాయ్.

తెలుగు అందం. అందానికే అందం. ఇన్ని అందాలు పెట్టుకొని.. ఏం చేస్తున్నారు ? అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టడం తప్ప. అక్కడ పని కావడం లేదు. సినిమా ఆఫర్లు రావడం లేదు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మీడియం రేంజ్ హీరోలని సైతం ఈషా ఆకట్టుకోలేక పోతుంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఈషాని ఫోటో షూట్ హీరోయిన్ గా ప్రేక్షకులు ఫిక్సయిపోవడం ఖాయం. తాజాగా.. ఓ పిక్ ని ఈషా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్స్.. ఇంకా ఎన్నాళ్లు.. ఈ ఎదురు చూపులు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.