ఈ క్యాచ్‌ అద్భుతమైనది

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ హర్లీన్‌ కౌర్‌ డియోల్‌ అద్భుతమైన క్యాచ్ పట్టింది. అమీజోన్స్‌ (43; 27 బంతుల్లో 4×4, 2×6) అనే ఇంగ్లిష్‌ బ్యాటర్‌ను బౌండరీ లైన్‌వద్ద క్యాచ్‌ అందుకొని పెవిలియన్‌ పంపించింది.

శిఖాపాండే వేసిన 18.5 ఓవర్‌కు అమీజోన్స్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ షాట్ ఆడడంతో మ్యాచ్‌ చూస్తున్నవారంతా బంతి సిక్స్‌ర్‌గా వెళ్తుందని భావించారు. కానీ, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న హర్లీన్‌ చివరి క్షణాల్లో అథ్లెటిక్స్‌ విన్యాసాలు చేస్తూ క్యాచ్‌ అందుకొని వారెవ్వా అనిపించింది.

ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు కూడా హర్లీన్‌ను అభినందిస్తూ ఇలా ట్వీట్లు చేశారు. హర్లీన్‌ నువ్వు పట్టిన ఈ క్యాచ్‌ అద్భుతమైనది. నాకైతే ఇది కచ్చితంగా ‘క్యాచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అనిపిస్తోంది అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ట్విట్ చేశారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>That was a brilliant catch <a href=”https://twitter.com/imharleenDeol?ref_src=twsrc%5Etfw”>@imharleenDeol</a> <a href=”https://t.co/c0KZspHFhe”>https://t.co/c0KZspHFhe</a></p>&mdash; OTTRelease (@ott_release) <a href=”https://twitter.com/ott_release/status/1413748915199877120?ref_src=twsrc%5Etfw”>July 10, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>