అందుకే.. యాక్టివ్ మోడ్ లోకి ప్రొఫెసర్ !?

ప్రొఫెసర్ కోదండరాం – తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. పొలిటికల్ జేఏసీ చైర్మెన్ గా పని చేశారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లారు. అవసరం వచ్చినప్పుడల్లా.. తెలంగాణ ఉద్యమ తీవ్రని చూపించడంలో తనదైన పాత్ర పోషించారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక.. సారు కేసీఆర్ సంకలోకి రాలేదు. దీంతో ఆయన్ని పక్కకు పెట్టారు. మొదట్లో సారునే ప్రధాన ప్రతిపక్షం అనిపించేది. ఆయనే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై పోరాడేవారు. అయితే ఆ పోరాటం రాను రాను తగ్గింది.

సొంతంగా ‘తెలంగాణ జన సమితి(తెజస) పార్టీ పెట్టుకున్నా.. దాన్ని ప్రభావం కనిపించడం లేడు. ఇక కరోనా విజృంభణ తర్వాత ప్రొఫెసర్ మరింత కామ్ అయ్యారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసినా.. థర్డ్ ప్లేస్ దక్కింది. కోదండరామ్ కంటే తీర్మాన్ మల్లన్నపైనే నిరుద్యోగులు, ఉద్యోగులు నమ్మకం ఉంచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తీర్మార్ మల్లన్న, కోదండరాం చీల్చడంతో.. మరోసారి పల్లె రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. ఈ విషయం పక్కన పెడితే.. ఇటీవల సల్లబడ్డ ప్రొఫెసర్ మళ్లీ సీరియస్ అయ్యారు.

తెజసని అభివృద్ది చేస్తాం. ప్రజా సమస్యలపై పోరాడటం. దూసుకెళ్తామని ప్రకటన చేస్తున్నారు ప్రొఫెసర్. దీని వెనక ఓ బలమైన కారణం ఉంది. తెజస కాంగ్రెస్ లో విలీనం కానుంది అనే ప్రచారం ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అదే జరిగితే.. కోదండరాం అసలు ఉనికే పోయినట్టు. గతంలో కేసీఆర్ కింద పని చేసిన కోదండరామ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కింద పని చేయాల్సి ఉంటుంది. అది ఇష్టం లేని ప్రొఫెసర్ తన పార్టీని యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చే పని మొదలెట్టారు. ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతాం అని కోదండరాం అన్నారు.