పూజా మేజిక్.. ఫిదా కావాల్సిందే !

‘మీ సొంత మేజిక్ ని నమ్ముకోండి’ అంటోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. వరుస సినిమాలతో పూజా ఫుల్ బిజీ. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. ఒకే టైమ్ లో రెండు, మూడు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ రాణిస్తోంది. ఇంతటి బిజీలోనూ అప్పుడప్పుడు ఫోటో షూట్ చేస్తుంటుంది. తాజాగా బికినీలో చేసిన ఫోటో షూట్ కి సంబంధించి రెండు ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వీటికి ‘మీ సొంత మేజిక్ ని నమ్ముకోండి’ అంటూ కామెంట్ పెట్టింది.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్స్ ని పూర్తి చేసింది పూజా. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఇందులో చిరంజీవి ఆచార్యగా కనిపించనుండగా రామ్‌చరణ్‌ సిద్ధ పాత్ర పోషించాడు. రామ్‌చరణ్‌ కి జంటగా పూజా కనిపించనున్నారు. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ చిత్రంలో పూజానే హీరోయిన్ గా కనిపించనుంది.