ఆ సమస్యతో రానా బాధపడుతున్నాడట


g
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుపాటి కంటి ఆపరేషన్ కోసం యుఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఐతే, అనారోగ్య కారణాల వలన రానా కంటి ఆపరేషన్ వాయిదా పడినట్టు తెలిసిందే. దీంతో రానా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సింగపూర్ డాక్టర్ల వద్ద చికిత్స తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రచారంపై రానా స్పందించారు.

నాకు బ్లడ్ ప్రెషర్ సమస్య ఉంది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకొంటున్నా. ఆ కారణంగా కంటి సర్జరీ ఆలస్యమైందమైందని క్లారిటీ ఇచ్చారు రానా. మరీ.. ఇప్పటికైనా రానా ఆరోగ్యం బాగులేదంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి. ఇక, బాహుబలి సినిమాతో రానా ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ రానా మార్కెట్ ఏర్పర్చకొన్నారు. ప్రస్తుతం రానా చేతిలో మూడ్నాలుగు సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్ టీఆర్ బయోపిక్ లో రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్నారు.