అఖిల్ అభిమానులకు పండగే

ఉలి దెబ్బలి తిని రాయి శిల్పం అవుతుంది. ఎన్ని ఉలి దెబ్బలు తింటే.. అంత మంచి శిల్పం తయారవుతుంది. ఇప్పుడు.. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ఉలి దెబ్బలని బరిస్తున్నాడు. రాటు దేలుతున్నాడు. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ అట్టర్ ప్లాప్ అయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిస్టర్ మజ్ఝ్ను, హలో సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

అఖిల్ నాల్గో సినిమాగా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కింది. రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇక ఇప్పటికే తన ఐదో సినిమా ‘ఏజెంట్’ అఖిల్ మొదలెట్టేశాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. తాజాగా ఏజెంట్ ఫస్ట్ లుక్ లోడింగ్ అంటూ.. చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. కండలు తిరిగిన దేహంతో అఖిల్ బ్యాక్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ హీరోగా ఆ కటౌట్ ఉంది.

ఈ పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. ముందు ముందు మీకు పండగే అంటూ కామెంట్ పెట్టాడు. అఖిల్ మార్కెట్ ను మించి ఈ సినిమాకు బడ్జెట్ అవుతుందట. అందుకే ఓ మంచి ఓటీటీ పార్టనర్ ను భాగస్వామిగా చేసుకొని.. థియేటర్-ఓటీటీలో ఒకేసారి రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారని సమాచారమ్.